మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత.. ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి బౌలర్ గా..!

-

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ను ఔట్ చేసిన స్టార్క్ ఈ మార్క్ కి చేరుకున్నాడు. దీని ద్వారా మరో అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు.

వన్డే ప్రపంచ కప్ లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా స్టార్క్ నిలిచాడు. స్టార్క్ కేవలం 941 బంతుల్లోనే 50 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ 1187 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్ తో మలింగ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా ఇప్పటివరకు 112 మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 221 వికెట్లను పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news