న్యూ హెయిర్ స్టైల్​తో ఇంటర్నెట్​ని షేక్​ చేస్తున్న MS ధోని

-

MS dhoni New look and new hair style: క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఏజ్ పెరిగే కొద్ది మరింత హ్యాండ్సమ్ గా మారుతున్నారు. ఐపీఎల్-2024 కోసం వింటేజ్ లుక్ లో లాంగ్ హెయిర్ తో కనిపించిన తలా తాజా మరో లుక్ తో ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పంచుకున్నారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసుపోరంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

MS dhoni New look and new hair style he looks fabulous in long hair

కాగా మొన్నటి ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయస్సులోనూ రికార్డులు కొల్లగొట్టాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా ధోని,ఫీల్డింగ్‌లో తన విన్యాసాలతో అలరిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని.. ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 150 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడిగా ధోని సొంతం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news