మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఈయన జీవిత చరిత్రను కూడా MS ధోనీ ది అంటోల్డ్ స్టోరీ పేరుతో సినిమాగా చిత్రీకరించారు.
అయితే 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఉపయోగించిన బ్యాట్ ఇప్పటివరకు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. లండన్ లోని ఓ చారిటీ ఈవెంట్ లో ధోని బ్యాట్ ను వేలం వేయగా…బ్యాట్ ఏకంగా రూ. 83 లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ ఈ భారీ ధరకు ధోని బ్యాట్ ను కొనుగోలు చేసింది. ఈ డబ్బును ధోని దంపతులు సాక్షి ఫౌండేషన్ కు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.