BREAKING : సినీ నటి జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. సీని నటి, మాజీ ఎంపి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. నటి జయప్రద సహా ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ ఎగ్మోర్ కోర్టు తీర్పు ఇచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం ఎగ్మోర్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
నటి జయప్రతతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధించడమే కాకుండా, 5 వేల చొప్పున జరిమానా విధించింది కోర్టు. చెన్నై రాయపేటలో గతంలో జయప్రద చెందిన సినిమా హాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించలేదు. ఈ తరుణంలోనే.. ఎగ్మూర్ కోర్టులో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కేసు వేసింది. ఇక తాజాగా సీని నటి, మాజీ ఎంపి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.