భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ అనంతరం ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ అనంతరం ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. అలాగే మొన్నా మధ్య జరిగిన విండీస్ సిరీస్‌కు కూడా ధోనీ ఎంపిక కాలేదు. దీంతో అతను రిటైర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా నిజం కాలేదు. అయితే తాజాగా కెప్టెన్ కోహ్లి పోస్ట్ చేశాడంటూ ట్విట్టర్‌లో ధోనీపై ఓ కామెంట్ వైరల్ అవుతుండడంతో ధోనీ రిటైర్మెంట్ వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి దీనిపై భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.
ధోనీ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ప్రసాద్ అన్నారు. కోహ్లి ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి కామెంట్లు చేయలేదని, అవన్నీ నకిలీ పోస్టులేనని, పుకార్లేనని కొట్టి పారేశారు. ధోనీ రిటైర్మెంట్ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, అతని రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదని కూడా ప్రసాద్ అన్నారు.
అయితే అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న 3 టెస్టుల సిరీస్‌కు గాను ఇవాళ సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే నిజానికి ధోనీ టెస్టులకు ఎప్పుడో గుడ్‌బై చెప్పాడు. కేవలం వన్డేలు, టీ20లలోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్ వార్తలు రావడం సెలెక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో డ్యాషింగ్ వన్డే ఓపెనర్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగి టెస్టుల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్ మ్యాన్‌గా పేరున్న రోహిత్ టెస్టుల్లో ఎలా ఆడుతాడో చూడాలి..!