టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతను పెట్టే పోస్టులు వివాదాలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం అతను భారత జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అతను పెట్టిన ఒక పోస్టు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.
జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ జరుగుతున్న విషయం విదితమే. అందులో భారత్‌కు చెందిన క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ సారి ఒలంపిక్స్‌లో పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన కొందరు క్రీడాకారులు ఉన్నారు. దీంతో ఆ యూనివర్సిటీని మెచ్చుకుంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇమేజ్‌ను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ట్విట్టర్‌లో పెట్టిన ఆ పోస్టు కూడా పెయిడ్ పోస్ట్ అని తమకు తెలుసని, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని మెచ్చుకోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు పెయిడ్ పోస్టులు పెట్టడం సహజమే. కానీ ఏది పెయిడ్ పోస్టో, ఏది సాధారణ పోస్టో జనాలకు తెలుసని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్‌కు చెందిన ఓ ఫోటోను మార్పింగ్ చేసి దాంతో కోహ్లిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో కలిసి ఆగస్టు 4 నుంచి టెస్టులు ఆడనుంది. మరోవైపు ఇటు శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ బుధ, గురువారాల్లో రెండు టీ20లను ఆడనుంది.