అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో బీజేపీ పుంజుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై నిదానంగా వ్యతిరేకిత పెరగడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వీక్ కావడంతో బీజేపీకి ఛాన్స్ దొరికింది. పైగా దుబ్బాక ఉపఎన్నికలో గెలిచాక ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్కు దాదాపు చెక్ పెట్టినంత పనిచేసింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అంతా అనుకున్నారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా రాజకీయాలు చేయడం కలిసొచ్చింది. ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలోకి రావడం మొదలైంది.
ఈ పరిస్తితి ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ఒకవేళ హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచిన కూడా ఆ విజయం ఈటల రాజేందర్ ఖాతాలోకి వెళుతుంది కాబట్టి, ఆ తర్వాత కూడా బీజేపీకి గడ్డుకాలమే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయో.