క్రికెట్ లో న్యూజిలాండ్ అమ్మాయిలు రికార్డు సృష్టించారు. ముఖ్యంగా పురుషుల జట్టుకు సాధ్యం కానీ ఘనతను దక్కించుకున్నారు. దేశానికి తొలిసారి టీ 20 ప్రపంచకప్ అందించారు. ఒకేరోజు న్యూజిలాండ్ కి డబుల్ దమాకా అందించాయి. ఓవైపు పురుషుల జట్టు భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో విజయం సాధించగా.. మరోవైపు ఉమెన్స్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది.ఫైనల్ కి వెళ్లిన దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించదని మరోసారి నిరూపించింది.
టీ-20 పురుషుల జట్టు భారత్ పై గట్టి పోటీనిచ్చి తృటిలో టైటిల్ ని కోల్పోగా.. మహిళల జట్టు ఫైనల్ వరకు చాలా అద్భుతంగా ఆడి.. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ లో చేతులెత్తేసింది. దీంతో దక్షిణాఫ్రికా టైటిల్ కొడుతుందనుకుంటే.. ఊహించని రీతిలో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడి టైటిల్ ఎగురేసుకుపోయింది. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అమెలియా కేర్ 43, బ్రూక్ హాలీ డే 38, సుజీ బేట్స్ 32 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా ఉమెన్స్ 20 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికే 9 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ 33, మినహా మిగతా వారందరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. వరుసగా వికెట్లు పడటంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఓటమి తప్పలేదు.