వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 337 రన్స్ చేసింది. మలన్ 31, బెయిర్ స్టో 59, రూట్ 60, స్టోక్స్ 84, బట్లర్ 27, బ్రూక్ 30, మొయిన్ అలీ 08, విల్లీ 15 పరుగులు చేశారు. హారిస్ రౌఫ్ 3, షాహిన్ అప్రిది 2, వసీమ్ 2 ఇఫ్తికార్ 1 వికెట్ తీశారు. కాగా 338 టార్గెట్ ను పాకిస్తాన్ 6.2 ఓవర్లలో సాధిస్తేనే సెమీస్ కి అర్హత సాధిస్తుంది. ఇది అసాధ్యం కావడంతో ఇక ఆ దేశం వరల్డ్ కప్ నుంచి వైదొలిగినట్టేనని చెప్పవచ్చు.
అయితే ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ బౌలర్ హారిస్ రౌఫ్ చెత్త రికార్డును నెలకొల్పారు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో 527 పరుగులు ఇచ్చిన మొదటి బౌలర్ గా అవతరించాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు సమర్పించుకోలేదు. రౌఫ్ తరువాత స్థానంలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (526), శ్రీలంక పేసర్ మధుశంక 525, బంగ్లా బౌలర్ ముస్తాఫిజర్ రహ్మాన్ 484 పరుగులు ఇచ్చిన వారిలో ఉన్నారు. అంతేకాదు.. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చింది కూడా రౌఫ్ కావడం విశేషం.