పాకిస్థాన్ వరల్డ్ కప్ సెమీస్‌లో ప్రవేశించాలంటే బంగ్లాపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందో.. ఇప్పటికే విశ్లేషకులు కొన్ని సమీకరణాలు చెప్పారు. వాటి ప్రకారం.. పాక్ బంగ్లాపై కనీసం 316 పరుగుల తేడాతో గెలవాలి.
ఇంగ్లండ్ చేతిలో భారత్, న్యూజిలాండ్‌లు ఓడిపోవడం ఏమో గానీ పాకిస్థాన్‌కు ఐసీసీ వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్స్‌లోకి వెళ్లే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిస్తే తప్ప పాక్‌కు సెమీస్ అవకాశాలు లేవు. దీంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, మరో వైపు పాక్ క్రికెట్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం ఈ విషయంపై జోకులు వేస్తున్నాడు. వన్డేల్లో ఏ జట్టు చేయని విధంగా 500 పరుగులు చేసి బంగ్లాను ఓడిస్తామని అతను అనడం ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ వరల్డ్ కప్ సెమీస్‌లో ప్రవేశించాలంటే బంగ్లాపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందో.. ఇప్పటికే విశ్లేషకులు కొన్ని సమీకరణాలు చెప్పారు. వాటి ప్రకారం.. పాక్ బంగ్లాపై కనీసం 316 పరుగుల తేడాతో గెలవాలి. అయితే ఇలా చేస్తే వన్డేల్లోనే చరిత్ర అవుతుంది. కానీ ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. దీంతో పాక్ ఈ వరల్డ్‌కప్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే కనిపిస్తోంది. అయితే ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం బంగ్లాపై తాము 500 స్కోరు చేస్తామని అన్నాడు. అయితే ఇది జోక్ అని.. నిజంగానే అన్ని పరుగులు తాము చేస్తే ప్రత్యర్థిని తాము తక్కువ స్కోరుకు ఎలా కట్టడి చేస్తామంటూ అతను వెంటనే వివరణ ఇచ్చాడు.
కాగా 1992 ప్రపంచకప్ లోలాగానే పాకిస్థాన్ మొదట ఓటముల పాలై ఆ తరువాత వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. దీంతో ప్రపంచ కప్ సాధిస్తామని అనుకుంది. అయితే పాక్ ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. భారత్, న్యూజిలాండ్‌లు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టుకు సెమీస్ దారులు క్లోజ్ అయ్యాయి. దీంతో లీగ్ దశలోనే ఈ సారి పాక్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించనుంది. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు..!