పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా గ్రామం.. అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్లు!

-

పారిస్ ఒలింపిక్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల కోసం వసతి కల్పించే క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం క్రీడా గ్రామాన్ని పర్యావరణహితంగా, అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. మొత్తం 131 ఎకరాల్లో 82 భవనాలు ఉండగా వాటిలో 3 వేల ప్లాట్లలో 7200 రూమ్స్ ఉన్నాయి. సుమారు రూ.15,490 కోట్లతో దీనిని నిర్మించారు.

మొత్తం ఒలింపిక్స్‌లో పాల్గొనే 14,500 మందికి, పారాలింపిక్స్‌లో పాల్గొనే 9 వేల మందికి ఇది వసతి కల్పించనుంది. ప్రధాన భోజనశాలలో ఒకేసారి 3500 మంది భోజనం చేసేలా సదుపాయం కల్పించారు. భారతీయ అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. రోజుకు 40 వేల భోజనాలు అందించనున్నారు. బ్రేక్‌డ్యాన్సింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌ వంటి ప్రాక్టీస్‌ వేదికలున్నాయి.

ఇక్కడి మంచాలు కార్డుబోర్డుతో చేసినవి. ఇవి ఒకరికే సరిపోయేంత చిన్నగా ఉన్నాయని.. శృంగారానికి సౌకర్యవంతంగా ఉండేలా కనిపించడం లేదని చాలా మంది అంటున్నారు. కానీ ఇవి కలప, ఉక్కు మంచాల కన్నా దృఢంగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. అలానే ఈ క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచారట.

Read more RELATED
Recommended to you

Latest news