మోస్ట్‌ పాపులర్‌ హీరోగా ప్రభాస్‌.. హీరోయిన్‌ ఆలియా భట్‌

-

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ తాజాగా జూన్‌ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను విడుదల చేసింది. ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్‌లో నిలిచారు. మే నెలలో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్ జూన్‌లోనూ అదే స్థానంలో కొనసాగారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రెండో స్థానం దక్కించుకున్నారు.

ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. రామ్‌ చరణ్‌ ఈ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో ఆలియా భట్‌ మొదటిలో ఉండగా.. సమంత, దీపికా పదుకొణె తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డుల మీద సృష్టిస్తోంది. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం తాజాగా ‘బుక్‌మైషో’లో షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే.  విడుదలై దాదాపుగా నెల కావొస్తున్నా ఇంకా థియేటర్లు హౌజ్ఫుల్గా నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news