పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా సంబరాలు ఇవాళ్టి (జులై 26 2024) నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి క్రీడాకారులు పారిస్ చేరుకున్నారు. పలు ఈవెంట్లు కూడా ఇప్పటికే షురూ అయ్యాయి. అయితే ఇవాళ అధికారికంగా ఓపెనింగ్ సెరిమనీ జరగనుంది. దీంతో మిగతా ఈవెంట్లు కూడా గ్రాండ్ గా ప్రారంభం అవుతాయి.
అథ్లెట్ల పరేడ్ పడవల్లో ఉండగా.. సుమారు 94 పడవల్లో ప్లేయర్లు పయనిస్తారు. ఈ పరేడ్‌లో గ్రీస్ ముందు వరసలో ఉండగా, ఆ తర్వాత ఆల్ఫాబెట్ వరుస ఉన్నారు. ఆతిథ్య దేశ జాతీయ భాషను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆతిథ్య దేశం పరేడ్ చివరిలో వస్తుంది. 203లో ఆస్ట్రేలియా (2032 ఒలింపిక్స్), 204లో అమెరికా (2028 ఒలింపిక్స్), 205లో ఫ్రాన్స్ (2024 ఒలింపిక్స్) వస్తాయి.
మరోవైపు ఈ పరేడ్‌లో భారత్ 84వ స్థానంలో రానుంది. ఇక ఈ ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా ఉంటారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపిస్తారు.