ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 5 నుంచి గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రద్దు

-

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు పలు రైళ్లు రద్దయ్యాయని, ప్రయాణికులు ఆ వివరాలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు ద.మ.రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైను పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలగనున్నట్లు వెల్లడించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇవే.. 

  1. ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ (12205) రద్దయింది
  2. సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ (12206) ఈ నెల 29, 31 తేదీల్లో రద్దు
  • ఈ నెల 30న సికింద్రాబాద్‌-ముంబయి ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12220) , 31న ముంబయి-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12219) రద్దు
  • 31న నిజామాబాద్‌-పుణె (11410) ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • విజయవాడ-భద్రాచలంరోడ్‌ (07979), భద్రాచలంరోడ్‌-విజయవాడ (07278), డోర్నకల్‌-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్‌ (07756) రైళ్లు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు
  • విజయవాడ-సికింద్రాబాద్‌ (12713), సికింద్రాబాద్‌-విజయవాడ (12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ (17201), సికింద్రాబాద్‌-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు ఆగస్టు 5 నుంచి 10 వరకు రద్దయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news