ఐపీఎల్ 2025కి ముందు భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్ తమ కొత్త అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్‌గా 17 ఏళ్ల విశిష్ట కెరీర్‌తో, పార్థివ్ జట్టుకు అనుభవం, విజ్ఞాన సంపదను అందించాడని అహ్మదాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
గతంలో ముంబై ఇండియన్స్‌కు స్కౌట్‌గా మరియు ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన పార్థివ్, ఐపిఎల్‌లో ఆటగాడిగా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి తొలుత ఎంపిక అయ్యాడు. అద్భుతమైన బ్యాటర్ గా గుర్తింపు పొందిన తరువాత అతను MI టైటిల్ విన్నింగ్ జట్టులో కూడా భాగమయ్యాడు. 2018లో IPLలో తన చివరి దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. పార్థివ్ ప్రస్తుతం కామెంటేటర్, అనలిస్ట్ గా సేవలందిస్తున్నారు. ఇక పై మైదానంలో దిగనున్నారు. పార్థివ్ పటేల్ భారత్ తరుపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ-20లకు ప్రాతినిధ్యం వహించారు. 139 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడారు.