ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ పెట్టారు : మాజీ సీఎం జగన్

-

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ పెట్టారని  మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా ఆయన బడ్జెట్ పై తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిమితికి మించి అప్పులు చేశామని తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక పద్దతి ప్రకారం మా ప్రభుత్వం పై అబద్దపు ప్రచారాలు చేవారు. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు సంవత్సరాలే ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేవపెట్టారు. అప్పుల విషయంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు, జగన్ ముఖాలను చూసి ఏ బ్యాంకులు రుణాలు ఇవ్వవు. 

ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు. టీడీపీ ఆర్థిక మంత్రి ఆరోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి అప్పు అన్నాడు. దత్తపుత్రుడు అప్పుల్లో ఆంధ్రాపేరు అప్పు రత్నా అంటూ పేరు పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రం రుణం 11లక్షల కోట్లు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్ లోనే తెలిసిపోయింది. గతంలో జగన్ ప్రభుత్వం విఫలం కావాలనేది టీడీపీ ఉద్దేశం అని తెలిపారు జగన్. 

Read more RELATED
Recommended to you

Latest news