టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్చాచ్ లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. టాస్ ఓడిపోయిన కోల్ కతా జట్టు మాత్రం బౌలింగ్ చేయనుంది. ఈ సీజన్ లో ఐపీఎల్ పాయింట్ల పట్టికను పరిశీలించినట్టయితే పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ లు ఆడితే.. 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం 8 మ్యాచ్ ల్లో కేవలం 3 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. హోరా హోరీగా సాగే ఇవాల్టి మ్యాచ్ ఇద్దరికీ చాలా కీలకమే. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారో చూడాలి.

పంజాబ్ కింగ్స్ జట్టు : 

ప్రియాన్ష్ ఆర్య, ప్రభు సిమ్రాన్, శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లీస్, వాహెదర, శశాంక్ సింగ్, మ్యాక్స్ వెల్, ఒమర్ జై, జాన్సన్, అర్షదీప్ సింగ్, యుజువేంద్ర చాహల్.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు : 

రెహ్మనుల్లా గుబాజ్, సునీల్ నరైన్, అజింక్యా రెహానె, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అండ్రే రస్సెల్, పోల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Read more RELATED
Recommended to you

Latest news