ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఇంటితో పాటు 14 చోట్ల ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. గడిచిన 12 గంటలుగా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హరిరామ్ భార్య అనిత ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నీటి పారుదల శాఖలో అనిత డిప్యూటీ ఈఎన్సీ గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరాం. NDSA రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేపట్టింది. రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి NDSA నివేదిక ఇచ్చింది.
ఈ నివేదికలో హరిరామ్ పై పలు కీలక అంశాలు ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరామ్ భారీగా ఆస్తులు కూడపెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వెల్ లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్ లో లగ్జరీ ప్లాట్లు గుర్తించింది ఏసీబీ. గజ్వెల్ నియోజకవర్గంలో 30 నుంచి 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఆధారాలపై ఎమ్మార్వో కార్యాలయం లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.