భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు అంతర్జాతీయం గా అరదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్ కమిషన్ సభ్యురాలిగా భారత దిగ్గజ షట్లర్ పీవీ సింధు ఎంపిక అయింది. తాజాగా బీడబ్లూఎఫ్ ఈ విషయాన్ని ప్రకటించింది. పీవీ సింధు తో పాటు మరో ఐదుగురిని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్ కమిషన్ సభ్యులుగా నియమించింది. ఈ ఆరుగురు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ సభ్యలుగా 2021 నుంచి 2025 వరకు కొనసాగుతారు.
కాగ ఈ సారి బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ సభ్యులు గా అమెరికా నుంచి ఐరిస్ వాంగ్, నెదర్లాండ్ నుంచి రాబిన్ టేబిలింగ్, ఐఎన్ఏ నుంచి గ్రేసియా పోలీ, కొరియా నుంచి కిమ్ సోయోంగ్, చైనా నుంచి జెంగ్ సీ వీ తో పాటు భారత్ నుంచి పీ వీ సింధు ఎంపిక అయ్యారు. కాగ పీవీ సింధు ఇటీవల బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ సభ్యత్వం కోసం నామినేషన్ కూడా వేశారు.