ఈ మధ్య క్రీడా కారులు రాజకీయాల్లో అడుగుపెట్టడం అనేది మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. రాజకీయాల మీద వాళ్లకు ఆసక్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ కోసం తలుపులు తెరిచే ఉంచుతున్నాయి. క్రికెటర్లు బాక్సర్లు ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లో చేరుతున్నారు. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇస్తున్న నేపధ్యంలో రెండో ఇన్నింగ్స్ కి ఆసక్తి చూపిస్తున్నారు.
గంభీర్ లాంటి వాళ్ళు ఎంపీలు అయ్యారు. కొంత మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బిజెపిలో జాయిన్ అయ్యారు. ఆమెకు ఉత్తర ఢిల్లీ లో ఎమ్మెల్యే సీటు ఇస్తారని భావించారు. కాని అది నిజం కాదని తెలిసింది. ఇక ఇప్పుడు బిజెపిలోకి మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు చేరే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో పీవీ సింధు భేటీ అయ్యారు. తమిళిసైతో పీవీ సింధు కుటుంబ సభ్యులు కూడా భేటీ అయ్యారు. మహిళా దినోత్సవ వేడులకు పీవీ సింధును గవర్నర్ ఆహ్వానించారు. కాని ఆమె బిజెపిలో చేరుతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. దీనితో ఒక్కసారిగా ఈ వార్త తెలంగాణా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి ఆమె చేరతారో లేదో చూడాలి.