RR vs RCB, Eliminator : ఇవాళ ఆర్సీబీ వర్సెస్‌ రాజస్థాన్‌ మ్యాచ్‌..జట్ల వివరాలు ఇవే

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్తుంది. గెలిచిన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సిబి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, Eliminator

ఈసారి ఎలాగైనా ఆర్సిబి జట్టు విజయం సాధిస్తుందని… ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా లీక్ దశలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఇందులో కూడా గెలుస్తుందని అంటున్నారు. అటు రాజస్థాన్ పరిస్థితి దారుణంగా తయారయింది. వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడి సతమతమవుతోంది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ XI: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (c/wk), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు XI: ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (WK), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version