ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత రాజస్థాన్ జట్టు టాస్ గెలిచింది. అయితే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ లో రాజస్థాన్ కి టార్గెట్ ఎంత నిర్ణయిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు జరిగిన 6 హోరా హోరీ మ్యాచ్ లలో గుజరాత్ జట్టు రాజస్థాన్ ని 5 సార్లు ఓడించింది. చివరగా ఒకసారి 2023లో రాజస్థాన్ అహ్మదాబాద్ లో విజయం సాధించింది. ఈ సారి కూడా అలాంటి విజయం సాధిస్తుందా..? లేదా గుజరాత్ విజయం సాధిస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గుజరాత్ టైటాన్స్ : శుబ్ మన్ గిల్, సాయి దర్శన్, శుబ్ మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్ పోర్డ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రినివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హిట్మేయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, దేశ్ పాండె.