సోషల్ మీడియా ఆకృత్యాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

-

మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆకృత్యాల పట్ల సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ కామెంట్స్ ఇంకా ఎంత బాధకు గురి చేసే ధోరణి, మా వంటి మహిళలకు పని చేయలేని పరిస్థితులను కల్పిస్తున్నాయి. రాములమ్మా అని ఫోన్ ల ద్వారా ప్రత్యక్షంగా ఎందరో మహిళలు తనను అడుగుతున్నారని చెప్పార. దీనిపై ప్రతీ సమస్య కంప్లైంట్ చేయబడాలి. ప్రతి సమస్య పరిష్కరించబడాలని ఆమె ఉన్నారు.

దేశంలో చాలా సమస్యల పరిష్కారానికి అనుగుణంగా నియమ, నిబంధనలు చట్టాలు ఉన్నాయని ఆఫీసుల్లో మహిళల రక్షణకు విమెన్ ప్రొటెక్షన్ సెల్స్ పెట్టాలనే సూచన కూడా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంగతి చెప్పాల్సిన పని లేదని.. ఆ పోస్టింగ్స్, కామెంట్స్, స్టేట్ మెంట్స్ ఎన్నో కుటుంబాల్లో బాధను కలిగిస్తూ.. సమాజంలో కష్టాన్ని కలిగిస్తూ పని చేయలేని పరిస్థితులు ఉంటున్నాయని పలువురు మహిళలు చెబుతున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news