Ravindra Jadeja : రీ-ఎంట్రీలో దుమ్ములేపుతున్న జడ్డూ..7 వికెట్లు తీసి రెచ్చిపోయాడుగా!

-

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీలో దుమ్ము లేపుతున్నాడు. రంజి ట్రోఫీ 2022-23 సీజన్ లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జడ్డు బాయ్. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చాటాడు.

గాయం కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డు, రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే సెలెక్టరు సైతం అతనికి రంజీల్లో ఆడెందుకు అనుమతి ఇచ్చారు.

ఈ క్రమంలో జడేజా వచ్చి రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, బ్యాటింగ్ లో కాస్త పరవాలేదనిపించిన జడేజా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో చెలరేగిపోయాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే చాపచుట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version