యష్ దయాళ్ ఇప్పుడు హీరో అయ్యాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సిబి అదరగొట్టింది. సీఎస్కే పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. 219 పదవుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర 61, రహానే 33 పరుగులు చేశారు. చివర్లో ధోని (25, 13 బంతుల్లో) జడేజా (42, 22 బంతుల్లో) పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఆర్సిబి బౌలర్లలో యశ్ దయాల్ 2, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, గ్రీన్ తలో వికెట్ తీశారు.
అయితే.. గతేడాది ఐపీఎల్‌లో రింకు సింగ్ కొట్టిన 5 సిక్సులతో ప్రపంచంలో వరస్ట్ బౌలర్ అంటూ యష్ దయాళ్ పై ట్రోల్స్…చేశారు. ఆ తర్వాత పది రోజుల్లో 5 కేజీల పైన బరువు తగ్గిపోయాడు… గుజరాత్ ఆ తర్వాత ఆడించలేదు. తర్వాత ఫ్రాంచైజ్ నుంచి కూడా తప్పించారు. దీంతో యష్ దయాళ్ ను కోహ్లీ రికమండేషన్‌తో ఆర్సీబీ కొనుక్కుంది. ఆర్సీబీ 14 మ్యాచులు ఆడితే అందులో 13 మ్యాచులు ఆడి 15 వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్‌తో కెరీర్‌లో ఇబ్బంది పడిన బౌలర్ యష్ దయాళ్… నిన్న అదే లాస్ట్ ఓవర్ వేసి ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కి తీసుకెళ్ళాడు.