రో.. ఈ గుడ్ బై బాధగా ఉంది.. హిట్ మ్యాన్ వైఫ్ రితికా పోస్టు

-

17 ఏళ్ల తర్వాత భారత్ విశ్వవిజేతగా అవతరించడంతో యావత్‌ భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ అందుకున్న ఉద్విగ్న క్షణాల్లో ఆనందభాష్పాలతో చెమర్చిన కోట్ల కళ్లు ఆ తర్వాత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో మరింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ సతీమణి రితికా తన రియల్ లైఫ్‌ హీరోకు ప్రత్యేకంగా విష్‌ చేశారు.

‘‘రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ ఫార్మాట్‌, ఈ కప్పు, ఈ ఆటగాళ్లు.. ఈ ప్రయాణం.. ఇదంతా నువ్వు కన్న కల. గత కొన్ని నెలలు నువ్వు చాలా కఠిన సమయాన్ని గడిపావు. అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. కానీ వాటన్నింటినీ అధిగమించి నువ్వు నీ కలను నెరవేర్చుకోవడం చాలా స్ఫూర్తి కలిగిస్తోంది. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నా. కానీ, నీ ఆటను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఇప్పుడు టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా జట్టుకు ఏది ఉత్తమమైందో దానిగురించే నువ్వు సుదీర్ఘంగా ఆలోచిస్తావు. కానీ దీన్ని నేను సులువుగా తీసుకోలేకపోతున్నా. ఇంతటి గొప్ప వ్యక్తి నా సొంతం అయినందుకు నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్‌ వ్యూ సో మచ్‌’’ అని రితిక ఎమోషనల్ పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news