మహారాష్ట్ర లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయింది ఓ కుటుంబం. కళ్ళ ముందే కుటుంబం అంతా వరదలో కొట్టుకుపోయారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోనావాలా ప్రాంతంలోని భూషీ డ్యామ్ వద్ద ఉన్న వాటర్ ఫాల్ చూచేందుకు వెళ్లి.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది కుటుంబం.
లియాఖత్ అన్సారీ(36), అమీమా ఆదిల్ అన్సారీ(13), ఉమేరా ఆదిల్ అన్సారీ(8) మృతదేహాలు లభించాయి. ఇక అద్నాన్ సబాహత్ అన్సారీ(4), మరియా అకిల్ అన్సారీ(9) ఆచూకీ ఇంకా లభించలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక ఇటు నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వనపట్లలో వర్షానికి మట్టిమిద్దె కూలి నలుగురు మృతి చెందారు. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో తల్లి పద్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనలో తండ్రికి గాయాలయ్యాయి.