ధోని, కోహ్లీని మించిపోయిన పంత్, జడేజా

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే క్యాష్ రీచ్ క్రికెట్ లీగ్. బీసీసీఐ కాసుల పంట పండిచండమే కాకుండా దేశ, విదేశీ క్రికెటర్ల జేబులు నింపుతున్నది. రూ.కోట్ల డబ్బును కురిపిస్తున్నది. ఐపీఎల్-2022 కోసం రిటైన్ ప్రక్రియ ముగియడంతో ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్లను అట్టిపెట్టున్నది తేలిపోయింది. వారికిచ్చే పారితోషికాలపైనా స్పష్టత వచ్చింది. అయితే, అనూహ్యంగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ కంటే యువ ప్లేయర్లకే అత్యధిక పారితోషికం లభిస్తుండటం గమనార్హం.

ఐపీఎల్ -2022 కోసం రిటైన్ చేసిన ప్లేయర్లలో ముంబయి ఇండియన్స్‌కు చెందిన రోహిత్ శర్మ, సీఎస్‌కేకు చెందిన రవీంద్ర జడేజా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన రిషబ్‌పంత్‌కు అత్యధికంగా రూ.16కోట్ల పారితోషికం అందనున్నది. వీరి కంటే తక్కువగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాప్టెన్‌ విరాట్ కోహ్లీకి రూ.15కోట్లు, సన్‌‌రైజర్స హైదరాబాద్ క్యాప్టెన్ కన్నె విలయమ్సన్, రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన సంజూ శాంసన్‌కు రూ.14కోట్లు, ముంబయి ఇండియన్స్‌కు చెందిన జస్ప్రిత్ బుమ్రా, పంజాబ్ కింగ్స్‌కు చెందిన మయాంక్ అగర్వా‌ల్, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఎంఎస్ ధోని, కేకేఆర్‌కు చెందిన ఆండ్రూ రస్సెల్‌కు రూ.12కోట్ల చొప్పున పారితోషికం అందనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version