ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వడ్ల పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వడ్ల కొనుగోలు చేయాలని.. కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తూంటే… కేంద్ర ప్రభుత్వం మాత్రం.. కేవలం వానాకాలం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతోంది. దీంతో యాసంగిలో తెలంగాణ రైతులేవరూ.. వరి వేయద్దని సీఎం కేసీఆర్ స్వయంగా… ప్రెస్ మీట్ నిర్వహించి.. కోరారు. ఇలాంటి నేపథ్యంలోనే… మిర్యాలగూడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
యాసంగి లో రైతులు వరి సాగు చేస్తే.. మంచి ధరకు కొనగోలు చేయించే బాధ్యత తనదేనంటూ ప్రకటించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మిర్యాలగూడ తో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే.. మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయించేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ ఏం చెప్పినా.. అయోమయానికి గురి కాకుడదన్నారు. వరి సాగు కోసం నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని కూడా విడుదల చేయిస్తామని భాస్కర్ రావు.. హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన.. వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.