భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్. ఏడు సంవత్సరాల వివాహ బంధానికి.. రెండు దశాబ్దాల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు సైనా నెహ్వాల్.

చాలా ఆలోచించిన తర్వాతే కశ్యప్, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది ఇలా ఉండగా సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి ఇద్దరు 2018 లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్లు కావడం విశేషం. స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకుని ఏడు సంవత్సరాల తర్వాత తీసుకున్నారు. ఈ ప్రకటనతో.. క్రీడారంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.