తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3.58 కార్డులను పేదలకు అందించబోతున్నారు. కొత్త కార్డులతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకు పైగా చేరనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.