ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన రిటైర్మెంట్పై ఇటీవలే ప్రకటన చేసింది. గతేడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నా.. ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో ఎట్టకేలకు చెప్పేసింది.
ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది ఇలా ఉండగా తాజాగా సానియా మీర్జా కొత్త కొత్త కెరీర్ ను ప్రారంభిస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మెంటర్ గా ఇక తన కెరీర్ ను కొనసాగించనుంది. ఈ మేరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం అధికారిగా ప్రకటన చేసింది.
While our coaching staff handle the cricket side of things, we couldn’t think of anyone better to guide our women cricketers about excelling under pressure.
Join us in welcoming the mentor of our women's team, a champion athlete and a trailblazer! 🙌
Namaskara, Sania Mirza! 🙏 pic.twitter.com/r1qlsMQGTb
— Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023