పాక్ క్రికెటర్లకు షాక్.. రావల్పిండి స్టేడియం పై భారత్ డ్రోన్ దాడి

-

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు ఏప్రిల్ 22న దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 28 మంది భారతీయులు మరణించారు. దీనికి కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ఉగ్రవాదులను అంతం చేస్తుంటే.. పాకిస్థాన్ ఆర్మీ భారత్ పై  దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత్ కూడా ఆపరేషన్ సిందూర్ ని కొనసాగిస్తూ పాక్ కి  చుక్కలు చూపిస్తోంది. భారత్ తాజాగా పాకిస్థాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఇదే స్టేడియంలో పాకిస్థాన్ సూపర్ లీగ్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగాలి. కానీ డ్రోన్ దాడుల నేపథ్యంలో స్టేడియం ఒక పక్క కొంతవరకు దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి మిగితా మ్యాచ్ లను కరాచీలో నిర్వహించాలని పీఎస్ఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news