గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం

-

మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి బిగ్ షాక్. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి తృటిలో ప్రమాదం తప్పంది. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ‘గంగూలి ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా నిలిపేశాడు. దీంతో గంగూలీ డ్రైవర్‌ సడన్ బ్రేక్ వేశాడు.

Sourav Ganguly meets with car accident on Durgapur highway, he was on his way

ఈ క్రమంలో గంగూలీ కాన్వాయ్‌, మరో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదు. ’ అని పోలీసులు తెలిపారు. ఇక మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకు జరిగిన ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news