టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బోడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్… భారత కాలమాన ప్రకారం.. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు… బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.
అయితే… ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవాళ వర్షం పడితే రేపు రిజర్వ్ డే కూడా ఉంది. రిజర్వుడే రోజున వర్షం పడితే…. అప్పుడు మ్యాచ్ రద్దు అవుతుంది. ఫైనల్ మ్యాచ్ రద్దు అవుతే… టీమిండియా అలాగే సౌత్ ఆఫ్రికా ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడతాయ్. ఐసీసీ రూల్స్ కూడా ఇవే చెబుతున్నాయి. వర్షం జోరుగా రెండు రోజులపాటు పడితే… ఇద్దరికీ కప్ ఇవ్వనున్నారు.
ఇండియా XI: రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా XI: క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ