విజయంతో ఊపిరి పీల్చుకున్న సఫారీలు.. లంకకు సెమీస్‌ ఆశలు మరింత క్లిష్టతరం..!

-

ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 టోర్నీలో సౌతాఫ్రికాకు నిజంగా బిగ్‌ రిలీఫ్‌ వచ్చిందనే చెప్పవచ్చు. ఎన్నో ఓటముల అనంతరం ఇవాళ మళ్లీ ఆ జట్టు శ్రీలంకపై గెలిచి కొంత ఊపిరి పీల్చుకుంది.

ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 టోర్నీలో సౌతాఫ్రికాకు నిజంగా బిగ్‌ రిలీఫ్‌ వచ్చిందనే చెప్పవచ్చు. ఎన్నో ఓటముల అనంతరం ఇవాళ మళ్లీ ఆ జట్టు శ్రీలంకపై గెలిచి కొంత ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే సఫారీలు వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించగా.. ఆ జట్టు ఇంటా బయటా అందరి విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ సౌతాఫ్రికా శ్రీలంకపై గెలిచి కొంత వరకు రిలీఫ్‌ ఫీల్‌ అయ్యింది. ఇక శ్రీలంక 2 విజయాలతో సెమీస్‌ రేసులో నిలిచినప్పటికీ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీస్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు టాప్‌ 4 లో చోటు కోసం యత్నిస్తుండగా.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన లంక సెమీస్‌ రేసులో మరింత వెనుకబడింది.

చెస్టర్‌-లి-స్ట్రీట్‌లో ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ తీసుకోగా లంక ముందుగా బ్యాటింగ్‌కు వచ్చింది. అయితే మ్యాచ్‌లో తొలి బంతికే కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె ఔటయ్యాడు. అయినప్పటికీ లంక ఆరంభంలో చక్కని రన్‌ రేట్‌తో ముందుకు సాగింది. కానీ ఎప్పటికప్పుడు చెత్త షాట్లను ఆడి ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో శ్రీలంక 49.3 ఓవర్లలో కేవలం 203 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌, ప్రిటోరియస్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి. అలాగే రబాడా 2, పెహ్‌లుక్‌వాయో, జేపీ డుమినీలు చెరొక వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా 37.2 ఓవర్లోనే కేవలం 1 వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 206 పరుగులు చేసిన సౌతాఫ్రికా శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో హషీం ఆమ్లా (105 బంతుల్లో 80 పరుగులు, 5 ఫోర్లు), కెప్టెన్‌ డుప్లెసిస్‌ (103 బంతుల్లో 96 పరుగులు, 10 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించారు. వీరిద్దరి పోరాటానికి లంక బౌలర్లు కకావికలమయ్యారు. దీంతో పూర్తిగా 50 ఓవర్లు ఆడకుండానే సఫారీలు గెలిచారు. ఇక లంక బౌలర్లలో లసిత్‌ మలింగ మాత్రమే 1 వికెట్‌ తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version