ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతి కాదు కదా.. టాస్ కూడా వేయలేదు. ఈ క్రమంలో మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించి ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను ఇచ్చారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో జరగాల్సిన శ్రీలంక, పాకిస్థాన్ వన్డే మ్యాచ్ రద్దైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ ఆద్యంతం వర్షం అడ్డంకిగా నిలిచింది. అయితే 6 గంటల తరువాత వర్షం ఆగిపోయినా.. మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్ స్టాఫ్ విఫలం అయ్యారు. ఔట్‌ఫీల్డ్ చిత్తడిగానే ఉంది. దీంతో ఆటకు వీలుకాదని చెప్పి అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతి కాదు కదా.. టాస్ కూడా వేయలేదు. ఈ క్రమంలో మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించి ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను ఇచ్చారు. దీంతో పాకిస్థాన్, శ్రీలంక జట్ల ఖాతాల్లో ఒక్కో పాయింట్ వచ్చి చేరింది. అయితే గతంలో పాక్, లంకల మధ్య జరిగిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్‌లలో పాకిస్థానే పైచేయిగా ఉంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా పాక్ అదే ఊపును కొనసాగించి 2 పాయింట్లను సాధిద్దామనుకుంది. కానీ మ్యాచ్ రద్దు అయ్యే సరికి పాక్ ఖాతాలో కేవలం 1 పాయింట్ మాత్రమే చేరింది.
కాగా పాక్, లంక జట్లకు చెరొక పాయింట్ రావడంతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆ రెండు జట్లు టాప్ 4 స్థానాల్లోకి వచ్చి చేరాయి. శ్రీలంక పాక్ కన్నా మెరుగైన రన్ రేట్‌తో 3వ స్థానానికి ఎగబాకగా, పాక్ 4వ స్థానంలో ఉంది.