పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కోటలు బద్దలు కొట్టిన సూర్య భాయ్

-

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెనక్కినెట్టాడు. ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 25 బంతుల్లోనే 46 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్, ఈరోజు ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి ఎగబాకాడు.

దాంతో మంగళవారం వరకు మూడో స్థానంలో ఉన్న బాబర్ అజాం నాలుగో ర్యాంకు కి పడిపోయాడు. ఇంగ్లాండు తో మంగళవారం జరిగిన తొలి టీ20 లో బాబర్ అజాం 24 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుంచి ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో బాబర్ అజాం నెం.1స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. కానీ ఆసియా కప్ 2022 లో ఫామ్ కోల్పోయిన అతను వరుసగా కిందకి పడిపోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news