Surya kumar Yadav: ‘స్కై’ ఆడితే ఇట్లుంటది మరీ.. ఒకే ఓవర్లో 24 పరుగులు

-

Surya kumar Yadav: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో మరో ఓటమి చవిచూసింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్. నిన్న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డూప్లిసిస్, దినేష్ కార్తీక్ అద్భుతంగా ఆడటంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఆర్ సి బి. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది.

Suryakumar Yadav roars back into form with rapid 52 ahead of T20 World Cup

15.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. అయితే ఇందులో ఆకాష్ వేసిన 11 ఓవర్ లో అతడికి చుక్కలు చూపించాడు సూర్య కుమార్ యాదవ్. మూడు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు. గత మ్యాచ్లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం విద్య మించి గత మ్యాచ్లో డక్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మాత్రం తన ప్రతాపం చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news