బంగ్లాతో టెస్టు సిరీస్.. ఒక్క ‘సిక్సు’తో గోడ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

-

బంగ్లాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈనెల 13న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్నందున సర్ఫరాజ్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు.రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు గోడ బద్దలైంది.దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక బంగ్లాదేశ్‌తో నవంబర్ 19 నుంచి టెస్టు మ్యాచెస్ ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్‌ను చిత్తు చేసి జోరుమీదున్న బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోవడం లేదని భారత జట్టు పేర్కొంది.అందుకే విరాట్ కోహ్లీ..అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూనే మరోవైపు పేస్ బౌలింగ్‌ను కూడా ప్రాక్టీస్ చేశాడు. ఓ బంతిని భారీ సిక్సర్‌గా బాదగా.. అది కాస్త డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దాంతో సహచర ప్లేయర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌లో విరాట్ విశ్వరూపం చూపిస్తాడని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version