WTCలో బుమ్రా సరికొత్త రికార్డు.. నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంతో టీమిండియా ‘పేస్’ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం బుమ్రాకు ఇది పదోసారి.
దీంతో WTC చరిత్రలో 10 సార్లు 5 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ రెండో (9 సార్లు) స్థానంలో ఉన్నాడు. కాగా, తాజా ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈ మ్యాచ్ డ్రా అయినా తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, అనుహ్యంగా ఆస్ట్రేలియా జట్టు పుంజుకుని టీమిండియాను దారుణంగా దెబ్బతీసింది. ఒకానొక టైంలో ఇండియా విజయం ఖాయం అని అంతా భావించారు. జైస్వాల్, పంత్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.