పంజాబ్ కింగ్స్ లో విభేదాలు..అతడిపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్‌!

-

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.  ఆ జట్టు సహ యజమానుల మధ్య విభేదాలు ఏర్పడినట్లు వెల్లడించాయి. ఈ జట్టులో బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియా ప్రధాన వాటాదారులుగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే, తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్ధమైన మోహిత్ బర్మన్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతణ్ని అడ్డుకునేందుకు ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ కు సిద్ధమైనట్లు తెలిసింది.  చండీగఢ్‌ హైకోర్టును ఆశ్రయించినట్లు కథనాలు వచ్చాయి. పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీలో బర్మన్‌కు 48 శాతం, ప్రీతీ జింటాకు 23, నెస్‌ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్‌ పాల్‌ అనే బిజినెస్‌ పర్సన్‌కు ఉంది. ఈ వార్తలను మోహిత్ బర్మన్‌ కొట్టిపడేశారు. తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు దీనిపై పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అధికారిక ప్రతినిధులు ఎవరూ స్పందించక పోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news