T20 world cup 2024: నేడు భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్..

-

United States vs India, 25th Match, Group A: టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. భారీ స్కోరు నమోదు కాకుండా సరే కానీ… మ్యాచ్ లు మాత్రం చాలా టఫ్ గా ఉంటున్నాయి. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లు విజయం సాధించిన టీమిండియా… ఇవాళ అమెరికా జట్టుతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం… టీమిండియా వర్సెస్ అమెరికా మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

United States vs India, 25th Match, Group A

ఈ కీలక మ్యాచ్ న్యూయార్క్ లోని అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. ఇక ఇందులో టీమిండియా గెలిస్తే సూపర్ ఫోర్ కు వెళ్లడం ఖాయం. అయితే ప్రత్యర్థి అమెరికా జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తోంది. వాళ్లకు సొంత మైదానాలు కావడంతో… రెచ్చిపోయి ఆడుతున్నారు అమెరికా ప్లేయర్స్. అయితే ఇప్పటికే ఐర్లాండ్ అలాగే పాకిస్తాన్ జట్లను మట్టికరిపించిన టీమిండియా… అమెరికన్ కూడా ఓడించేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన జట్టు… కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగానే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version