టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా గెలిచిన తర్వాత వీళ్లిద్దరూ తమ నిర్ణయాన్ని తెలిపారు. రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తం 159 మ్యాచ్‌లాడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. 2010లో జింబాబ్వేపై టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లి.. 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లినే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.
‘‘ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా’’ – రోహిత్ శర్మ
‘‘నా చివరి టీ20 ప్రపంచకప్‌ను ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించా. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచే కెరీర్‌లో ఆఖరిది. భవిష్యత్ తరం వచ్చే సమయమిది’’ – విరాట్ కోహ్లీ