విండీస్ టెస్టులో విరాట్ డ్యాన్స్.. తగ్గేదే లే

-

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్​లో తన పర్ఫామెన్స్ అదరగొట్టడమే కాదు.. అప్పుడప్పుడు తన అల్లరి చేష్టలతో అభిమానలను ఆకర్షిస్తూ ఉంటాడు. ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే కోహ్లీ డిఫరెంట్​గా మారిపోతాడు. ఇక ఇండియా గెలిచినప్పుడు ఈ స్టార్ బ్యాటర్ సంబురాలు చూడాలి. డ్యాన్స్ చేస్తూ.. చిల్ అవుతూ.. చిన్న పిల్లాడిలా మారిపోతాడు. విరాట్ అల్లరికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరుగులతో హడలెత్తించే ఈ ప్లేయర్ అప్పుడప్పుడు మైదానంలో చిందులేస్తున్న వీడియోలకు ఇప్పటికే ఫ్యాన్స్ నీరాజనాలు పట్టారు.

అయితే తాజాగా విరాట్ మోరోసారి డ్యాన్సర్‌ అవతారం ఎత్తాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట సమయంలో తన డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో ఆడియెన్స్​ను అలరించాడు. స్లోగా బాడీని మూవ్ చేస్తూ.. చిరు చిరు స్టెప్పులతో ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇదే టెస్టులో శుభ్‌మన్‌ గిల్ కూడా మైదానంలో డ్యాన్స్‌ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు హల్​ చల్​ చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు విరాట్, గిల్ డ్యాన్స్​ అదరహో అంటూ కామెంట్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news