‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఫొటో వైరల్

-

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైన బెంగళూరు కథ ముగిసింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్థాన్ విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో రెండు హార్ట్ బ్రేకింగ్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకటి ఆర్సీబీ ఓటమి అయితే మరొకటి ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తీక రిటైర్మెంట్ ప్రకటన.

ఐపీఎల్‌ నుంచి ఆర్సీబీ ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌ కూడా వీడ్కోలు పలికేశాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 187.36 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురై ఇబ్బంది పడిన డీకేను హత్తుకొని విరాట్ కోహ్లీ ఓదార్చాడు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కార్తిక్‌కు ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇప్పించాడు. అభిమానులను కూడా ఉత్సాహపరుస్తూ ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ మైదానం మొత్తం చుట్టేశాడు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్ హార్ట్ ఎమోజీలు పోస్టు చేస్తూ వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు.

https://x.com/mufaddal_vohra/status/1793353244707537263

Read more RELATED
Recommended to you

Latest news