భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్‌దారుణ హత్య గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. అయితే దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగమైన బిధాన్‌నగర్, బైర్‌క్‌పుర్ పోలీసు బృందాలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు బుధవారం రోజున కోల్‌కతాలోని టౌన్‌హాల్‌కు చేరుకోగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. కానీ, మృతదేహం ఆచూకీ మాత్రం దొరకలేదు.
“సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో పరిశీలించగా.. మే 13న ఆ నివాస సముదాయంలోకి అనర్‌తో పాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రవేశించారు. మే 13, మే 15న ఆ ముగ్గురు వేర్వేరు సమయాల్లో బయటకు వెళ్లిపోయారు. కానీ, ఎంపీ బయటకు వెళ్లినట్లు ఎక్కడా రికార్డు కాలేదు. వారిలో ఇద్దరు పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకెళ్లడం కనిపించింది వాటిల్లో ఏమున్నాయో తెలియాల్సి ఉంది.” అని పోలీసులు తెలిపారు.