పాండ్యాపై విరాట్ కోహ్లీ సీరియస్‌.. వీడియో వైరల్‌

-

గౌహతి వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది. ముఖ్యంగా మాజీ సారధి విరాట్ కోహ్లీ సెంచరీ తో వీరవిహారం చేశాడు. 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే, మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఒక సంఘటన కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది. జట్టు స్కోర్ 303/4 వద్ద క్రిజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పైగా, అప్పటికే కుదురుకున్న విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వట్లేదు. ఇది ఇలా ఉంచితే, ఇన్నింగ్స్ 43వ ఓవర్లో స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బాదిన కోహ్లీ, రెండో పరుగు కోసం ప్రయత్నించగా హార్దిక్ నో అన్నట్లుగా సంజ్ఞలు చేశాడు. ఇదే కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది. పాండ్య వైపు కోహ్లీ గుడ్లు ఉరిమి చూశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version