కంగ్రాట్స్ స్మృతి – వీడియో కాల్లో కోహ్లీ అభినందనలు

-

రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ జట్టు WPL 2024 టైటిల్ తొలిసారి గెలిచింది. ఈ గెలుపు తర్వాత ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు తొలి గెలుపుతో ఆర్సీబీ ప్లేయర్స్ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ దక్కడంతో ఐపీఎల్‌ ఆర్‌సీబీ స్టార్స్‌ విరాట్‌ కోహ్లీతో పాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్‌ గేల్, ఏబీ డివిలియర్స్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం సాధించగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఉమెన్ అని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్‌ కోహ్లీ వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన విరాట్‌ అనంతరం ఇతర ప్లేయర్లతో ముచ్చటించాడు. అర్సీబీ ట్రోఫీను అందుకోవడానికి కొద్దిసేపటి ముందు విరాట్‌ కోహ్లీ ఈ కాల్‌ మాట్లాడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version