లండన్‌ రెస్టారెంట్‌లో వామికతో విరాట్ లంచ్ డేట్.. ఫొటో వైరల్

-

టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్‌లో ఉన్నారు. ఇటీవలే లండన్‌లో విరాట్ ఫొటో ఒకటి వైరల్ కాగా తాజాగా కోహ్లీ తన కుమార్తె వామికను తీసుకుని లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మరో ఫొటో వైరల్ అయింది. వామికతో విరాట్ లంచ్ డేట్ అంటూ నెట్టింట ఈ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది.

రెస్టారెంట్‌లోని ఓ టేబుల్‌ వద్ద వామిక భోజనం చేస్తుండగా పక్కన కోహ్లీ కూర్చుని ఫోన్‌లో ఏదో చూస్తూ కన్పించాడు. అయితే, తమ పిల్లల విషయంలో గోప్యత పాటించాలనుకుంటున్నట్లు విరాట్-అనుష్కలు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కుమార్తె ఫొటోలు తీయొద్దని ఆ మధ్య మీడియాను కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ దంపతుల నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తాజాగా వైరల్‌ అయిన ఫొటోలో కొందరు అభిమానులు వామిక ముఖంపై ఎమోజీని ఉంచి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version